ఈరోజుల్లో ఏ ఫంక్షన్ అయినా సరే.. డీజే మోగాల్సిందే.. ఆ హోరు ఉంటేనే సందడి అన్నట్టుగా తయారైంది వ్యవహారం. ఇప్పుడు అదే డీజే సౌండ్‌ ఏకంగా పెళ్లికొడుకు తండ్రి ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటనఒడిశాలోని మల్కాన్‌గిరి పట్టణంలో జరిగింది. దిల్లీ వాసి అంకిత్‌కు మల్కాన్‌గిరి యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇద్దరి కుటుంబాలు కూడా వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. నిశ్చితార్థం కోసం అంకిత్ కుటుంబం బుధవారం మల్కాన్‌గిరి వచ్చింది. లాడ్జీలో బస చేసి.. యువతి ఇంటికి వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. వారికి స్వాగతం పలికేందుకు డీజేను పెట్టించారు. అయితే.. ఆ శబ్దానికి యువకుడి తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ అనుకోని ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

dj