తెలంగాణ అమ్మాయి శిరీష దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేతులమీదుగా దేశంలోనే మొదటి లైన్ ఉమెన్‌గా నియామక పత్రం అందుకుంది. దేశంలోనే ఫస్ట్ లేడీ లైన్ మెన్‌గా రికార్డు సృష్టించింది. బబ్బూరి శిరీష అనే మహిళలను టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో ఉద్యోగుల నోటిఫికేషన్ లో భాగంగా  లైన్ మెన్ కు అప్లై చేసుకుంది. ఉద్యోగుల నోటిఫికేషన్ లో భాగంగా ఇవాళ ఆమె ఉద్యోగం పొందింది.


శిరీష ఇవాళ చరిత్రలో నిలుస్తోందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మహిళలకు ఈ రంగంలో అవకాశం తక్కువ అని..  గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు 200 పైచిలుకు లైన్ ఉమెన్ లను ట్రాన్స్ కో లో తీసుకున్నామని ఆయన తెలిపారు. కానీ టీఎస్ ఎస్పీ డీసీఎల్ లో తొలిసారిగా మహిళను లైన్ ఉమెన్ తీసుకున్నామన్నారు.  దేశ చరిత్రలో లైన్ ఉమెన్ గా ఉద్యోగం ఇచ్చిన టీఎస్ ఎస్పీడిసిఎల్ నిలుస్తోందని మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: