గుంటూరు జిల్లాలోని కొల‌క‌లూరు గ్రామంలో డయేరియా ప్రబలిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి విడదల రజని స్పందించారు. ఈ అస్వస్థత ఘటనపై విచారణ జరిపిస్తామని వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి విడదల రజని తెలిపారు. డ‌యేరియాకు సంబంధించి కొత్త కేసులు రాలేదని తెలిపిన  మంత్రి రజని.. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన 70 కేసుల్లో స‌గం మందిని డిశ్చార్జి చేశామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి వైద్యసాయం అందిస్తున్నామని.. బాధితుల‌కు ప్రభుత్వం అండ‌గా ఉంటుందని మంత్రి విడదల రజని భరోసా ఇచ్చారు.


ఈ అతిసారం ఘటనలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని ఆర్థికంగా త్వరలోనే ఆదుకుంటామని  మంత్రి విడదల రజని భరోసా ఇచ్చారు. తెనాలి మండలం పరిధిలోని ఈ గ్రామంలో డయేరియా భయపెట్టే స్థాయిలో ప్రబలింది. ఓ 14 ఏండ్ల బాలిక మరణించింది. 100 మందికి పైగా అస్వస్థతలో ఆస్పత్రుల్లో చేరారు. ప్రభుత్వం ఈ గ్రామంలో 25 పడకలతో తాత్కాలిక వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసింది. గ్రామస్తులకు అత్యవసర వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఇప్పటికే ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: