తెలంగాణలో మత్స్యకారుల కోసం సర్కారు ఓ యాప్ తీసుకొచ్చింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మీ సేవ యాప్ ను మంత్రి తలసాని ప్రారంభించారు. మత్స్యకారులు చేపల చెరువుల లీజును నేరుగా ఈ మీ సేవలో చెల్లించవచ్చని మంత్రి తలసాని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని మంత్రి తలసాని చెప్పారు.
ఆర్ధికంగా, సామాజికంగా మత్స్యకారులు అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు. కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ తదితర నూతన రిజర్వాయర్ల నిర్మాణం, మిషన్ కాకతీయ కింద శిధిలమైన చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడం ద్వారా అనేక నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తలసాని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి