కూలి పనులు చేసుకుంటూ పట్టుదలతో చదివి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన అనంతపురం జిల్లా శింగనమల మండలానికి చెందిన సాకే భారతిని జగన్ సర్కారు ఆదుకుంది. ఆమె ప్రతిభను మెచ్చిన.. ఏపీ ప్రభుత్వం 2 ఎకరాల స్థలం ఇచ్చింది. సాకే భారతికి జిల్లా కలెక్టర్‌ గౌతమి భూమి పట్టాను తన చేతులతో స్వయంగా అందజేశారు. కూలీ పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో సాకే భారతి పీహెచ్‌డీ పూర్తి చేయడం అనంతపురం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ అన్నారు.


పట్టుదల, సంకల్పం ఉంటే విజయాన్ని ఏది ఆపలేదనడానికి ఎస్టీ యువతి సాకే భారతి నిదర్శనమని కలెక్టర్ గౌతమి  ప్రశంసించారిు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా  సాకే భారతి ఎక్కడా వెనకడుగు వేయకుండా యువతకు ఆదర్శంగా మారిందని కలెక్టర్ గౌతమి అన్నారు. సాకే భారతికి ఉద్యోగ అవకాశం కింద జూనియర్ లెక్చరర్ పోస్ట్‌ని గుర్తించామన్న కలెక్టర్.. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని..  ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామని తెలిపారు. అలాగే  అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: