గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేయాలని కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్న అభ్యర్థులు ఎట్టకేలకు విజయం సాధించారు. గ్రూప్‌ 2 పరీక్ష పై టీఎస్‌పీఎస్సీతో చర్చించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశించారని నిన్న మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గ్రూప్‌ 2 రీషెడ్యూల్‌ చేసేలా చూడాలని సీఎస్‌కు కేసీఆర్‌ ఆదేశారని.. లక్షల మంది అభ్యర్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతే కాదు.. భవిష్యత్తులో నియామక ప్రకటనల విషయంలో ప్రణాళిక బద్దంగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించినట్టు తెలిసింది.


అయితే.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ లతో సమీక్షించి గ్రూప్ 2 పరీక్షల విషయమై అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించి గ్రూప్ 2 పరీక్షలను నవంబర్ కి వాయిదా వేశారని రాత్రి ఓ ప్రకటన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr