ఉద్యోగాల పేరిట మోసాలు ఎక్కువ అయ్యాయి. ఆ నోటిఫికేషన్ వచ్చిందని.. ఆ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేయడం ఎక్కువైంది. తాజాగా విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాలకు  నోటిఫికేషన్లు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం ఎలాంటి  నోటిఫికేషన్లు లేవని...తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సూచించారు. ఇటీవల తన పేరుతో మణుగూరులో ఓ వ్యక్తి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చినట్లు తెలిసిందని టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు.

ఈ నకిలీ అపాయింట్‌మెంట్స్‌పై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతుందని టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఎవరైనా విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపట్ల జాగ్రత్తగా  ఉండాలని.. ఏ ఉద్యోగమైనా పరీక్షలు అర్హతలు ఇంటర్వూల ఆధారంగానే వస్తాయని టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: