తెలంగాణ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో కాసుల వర్షం కురుస్తోంది. ఫ్యాన్సీ నంబర్లతో రూ. 41,86,370ల ఆదాయం సమకూరింది. TS 09 GD 9999 నంబర్ కు అత్యధికంగా రూ.15,53,000ల ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో వివిధ ఫ్యాన్సీ నంబర్లకు వచ్చిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి.

 ముప్పాల హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాహన TS 09 GD 9999 నంబర్ కు రూ.15,53,000ల ఆదాయం వచ్చింది. గీతా ఆటోమోటీవ్ ఎల్.ఎల్.పీకి చెందిన TS 09 GE 0009 నంబర్ కు రూ. 3,29,999ల ఆదాయం వచ్చింది. గారపాటి శ్రీనివాస్ బాబుకు చెందిన వాహనం TS 09 GE 0001 నంబర్ కు రూ.3,06,000ల ఆదాయం వచ్చింది. శ్రీలక్ష్మి గణపతి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వాహనం TS 09 GE 0005 నంబర్ కు రూ. 2,10,000ల ఆదాయం వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: