మాజీ సీఎం కేసీఆర్‌ కాలు జారి పడి తుంటి ఎముక ఆపరేషన్‌ చేయించుకుని ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను మొదటి రెండు రోజులు పెద్దగా రాజకీయ నాయకులు పరామర్శించలేదు. కానీ నిన్న ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారో..ఇక ఆ వెనుకే నేతలంతా క్యూ కట్టేశారు. కాలు జారి కిందపడి గాయాలుపాలై చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోదండ రెడ్డి, వి. హనుమంతురావు కూడా పరామర్శించారు.


హైదరాబాద్‌ యశోద నర్సింగ్‌ హోమ్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన వద్దకు వెళ్లిన వెంకటరెడ్డి, కోదండ రెడ్డి, హనుమంతురావులను మాజీ మంత్రి కేటీఆర్‌ దగ్గర ఉండి ఆస్పత్రిలోనికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ ఎలా గాయపడ్డారని వీరు కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నకేసీఆర్‌ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్ నాయకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR