లోక్‌సభలో సభలోకి అంగతకులు చోచ్చుకుని పోయిన ఘటనతో తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అలర్టయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున‌న దృష్ట్యా ఆన అత్యవసర సమావేశం నిర్వహించారు. శాసనమండలి చైర్మెన్, శాసనసభ ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి, పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాడానికి మూడెంచెల భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ప్రొటెం స్పీకర్ ఆదేశించారు.


ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించిన ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి.. ఇప్పటికే జారీ చేసిన పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసులను నిలిపివేయాలని సూచించారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు.. భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. ఈ మాత్రం జాగ్రత్త అవసరమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: