నూతన సంవత్సర వేడుకల్లో మత్తుమందుల వినియోగంపై
తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉంది. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే బార్లు, రెస్టారెంట్లు, నిర్వహకులు ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి వారికి నియమ నిబంధనలు జారీ చేసినట్లు
హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈవెంట్లు నిర్వహిచాలని వారు తెలిపారు. ప్రతి
ఈవెంట్ లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని పోలీసులు తెలిపారు.
ఈ వేడుకల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అలాగే 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దని వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల్లో
డ్రగ్స్ వాడితే జైలుకెళ్లక తప్పదని .. నిర్ణీత సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. వేడుకల్లో డ్రగ్స్ రాకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదేనని
హైదరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు.