వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. వాతావరణం అనుకూలించక కొండల్లో ఆ ప్రమాదం జరిగింది. అచ్చం అదే తరహాలో తాజాగా ఓ నేత కూడా మృత్యు ముఖంలో చిక్కుకున్నాడు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాజాగా ఆ దేశంలోని పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోసీన్ అమీర్ అబ్దొల్లాహియాన్ తో పాటు ఆ దేశ అధ్యక్షుడు అదే హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. వీరు ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పర్వత ప్రాంతాల్లో దట్టమైన మంచులో చిక్కుకుని అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.


ఈ ప్రమాదం నుంచి ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి బతికి బయటపడే అవకాశాలు చాలా తక్కువ అని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా సెర్చ్ ఆపరేషన్‌ చర్యలకు ఆటంకం కలుగుతోంది. తమకు అధ్యక్షుడు బతికి ఉన్నాడని.. ఇప్పటికీ ఆశలు ఉన్నాయని అంటున్నా.. సంఘటన స్థలం నుంచి అందిన సమాచారం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr