ఐఎస్ఐఎస్ దారుణాలు ఒక్కోటిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ముస్లిం దేశాల‌ను భ‌యంతో గుప్పింట్లో పెట్టుకోవాల‌ని చూస్తోంది ఈ ఉగ్ర‌వాదా సంస్థ‌.. దీనికి అనుబంధంగా ప‌నిచేస్తున్న మ‌రికొన్ని. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ రక్తదాహానికి అంతు లేదని ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపించుకుంటూ ఉంటున్నారు. ప్రపంచాన్ని ఉగ్రవాదంతో అల్లాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) సంస్థ, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు అనేక రకాల దారుణాలకు పాల్పడుతున్నాయని బ్రిటన్‌కు చెందిన ఓ సహాయక బృందం పేర్కొంది. ఇస్లామిక్ తిరుగుబాటులో భాగంగా మొజాంబిక్ ప్రాంతంలో ఐఎస్ఎస్‌తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు అత్యంత క్రూరంగా ప్రవర్తించాయని, 11 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల తలలు నరికారని ఈ సహాయక సంస్థ తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌లో ఆరోపించింది.



కాబో డెల్గాడో ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదుల తిరుగుబాటు వల్ల సుమారు 6,70,000 మంది నిరాశ్రయులైనట్లు పేర్కొంది. సదరు సహాయక బృందం.. 2,614 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. తాజాగా మొజాంబిక్ అనే ఉగ్రవాద సంస్థకు ఐఎస్ఎస్‌తో సంబంధాలున్నట్లు తేలడంతో, అగ్రరాజ్యం అమెరికా ఈ సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం సిరియా దేశ తీర ప్రాంతాల్లో పలు చోట్ల మానవ బాంబులు పేల్చి 120 మందిని పొట్టన పెట్టుకున్నారు.దాదాపు 100 మంది శవాలు గుర్తు పట్టలేని విధంగా రక్తపు ముద్దలు అయ్యాయి. వందలాధి మందికి తీవ్రగాయాలై శాశ్వ‌త విక‌లాంగులుగా మారారు.


అలాగే మ‌రో సంఘ‌ట‌న‌లో ఇరాక్‌లో  ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఘోర దారుణానికి ఒడిగట్టారు. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ఇరాకీ పౌరులను దారుణంగా కాల్చి చంపారు. ఇరాక్ సుప్రీం ఎలక్టోరల్ కమిషన్ లో పనిచేస్తున్న వీరందరినీ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చంపేశారని అధికారులు తెలిపారు. మొత్తం ఉద్యోగులందరినీ తుపాకులతో కాల్చి చంపారని వివరించారు. నినెవెస్ ప్రావిన్స్ లోని మౌసూల్ లో 50 మంది మహిళలను కూడా ఉగ్రవాదులు చంపారని తెలిపారు. వెంటనే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కల్పించుకుని ఇరాక్ పౌరులను కాపాడాల్సిన అవసరం ఉందని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: