
ఇష్టం లేకుండా బలవంతంగా ఎన్నోసార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె తెలిపింది. మహిళలను వేధించడం అతడికి సరదా అని ఆమె తెలిపింది. చౌదరి బషీర్ మరో వివాహం చేసుకుంటున్నట్లు తెలిసిందని.. ఈ విషయంపై ప్రశ్నించగా.. ట్రిపుల్ తలాక్ రూపంలో విడాకులు ఇచ్చినట్లు పేర్కొంది. పోలీసులు తనకు న్యాయం చేయాలని పేర్కొంది. కాగా.. ఈ ఘటన తర్వాత ఆ మహిళ బహీర్పై సంచలన ఆరోఫణలు చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకుని.. ముస్లిం మహిళా వివాహ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే గతంలోనూ బషీర్‌పై ఇదే తరహాలో కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయంలో 23 రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. కాగా, బషీర్.. మయావతి హయాంలో మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా అనంతరం బషీర్ ఏ పార్టీలో కొనసాగుతున్నారనే విషయం స్పష్టత లేదు. కాగా, మంత్రి హోదాలో కొనసాగిన బహీర్ ఆరో వివాహానికి సిద్ధమవడంపై మహిళ సంఘాలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు.