"మ‌ళ్లీ ఆమెకు గ‌ర్భం పుట్టేది ఎవ‌రు తేల్చింది. డాక్ట‌రు చెప్ప‌కూడ‌ని నిజం కానీ చెప్పాక అత‌గాడి పైశాచిక క్రీడ ఏ విధంగా ఉందో చెప్పే క‌థ‌నం మీ క‌ళ్లెదుట రాశి పోసిన అక్ష‌రాల్లో ఆవేద‌న ప‌ర్వాల్లో కాస్త చ‌ద‌వండి కాస్త‌యినా మారండి. ఈ అమానుష  క్రీడ‌కు చ‌ర‌మ గీతం పాడండి".

కాలం ఇంతగా మారినా, ఎంతో అభివృద్ధి చెంది డిజిటల్ కాలంలోకి అడుగుపెట్టినా... కొన్ని దురాచారాలు మాత్రం నేటికీ కొనసాగుతుండడం మన దురదృష్టకరం అనుకోవాలి. ఒక తల్లికి పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులోనే పిండాన్ని చిదిమేయడం, లేదా పుట్టాక కుప్పతొట్టిలోనో, రోడ్డుపైనో వదిలి వెళ్లిపోయిన ఘటనలు నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దుర్ఘటనే ఒకటి మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నగరం దాదర్ లో జరిగింది. తన భార్య తనకు మగ సంతానాన్ని ఇవ్వలేదని, ఆమెను మానసికంగానూ, శారీరకంగానూ హింసించడమే కాకుండా తాను గర్భం దాల్చిన ప్రతి సారి లింగ నిర్దారణ పరీక్ష చేయించి ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించాడు. ఈ విధంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఎనిమిది సార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు.

అంతే కాదు ఆమె ఖచ్చితంగా మగ బిడ్డనే గర్భం దాల్చడానికి 1500 కి మించి ప్రమాదకరమైన స్టెరాయిడ్లను ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆరోగ్యం పట్ల కనీస బాధ్యత లేకుండా ఒక కసాయిలుగా ప్రవర్తించాడు. ముంబైలోని నలభై ఏళ్ల మహిళ తన భర్త, అత్త మామల కొడుకు అనే వంశోద్ధారకుడి పిచ్చికి ఇలా బలయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం న్యాయవాదులు అయిన అత్తమామల ఇంటికి సదరు మహిళ కోడలిగా అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగు పెట్టిన ఆ మహిళ మొదట 2009 లో ఒక ఆడబిడ్డకు జన్మ నిచ్చింది. అంతే ఇక అప్పటి నుండి ఆమెకు అత్త వైపు నుండి వేదింపులు మొదలయ్యాయి. వారి ఆస్తికి, వంశానికి ఒక వారసుడు కావాలని మగపిల్లవాణ్ణి మాత్రమే ఆమె తరువాత కనాలని ఆమెను సూటి పోటి మాటలతో, వారి దుర్మార్గమైన వైఖరితో ఆమెను హింసకు గురి చేశారు.

2011 లో ఆమె మళ్ళీ గర్భం దాల్చగా ప్రి ఇంప్లాంటేషన్ లింగ నిర్దారణ పరీక్ష కోసం బ్యాంకాక్ కు తీసుకుని వెళ్లి మరీ ఆమెకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకొని అబార్షన్ చేయించాడట. అలా ఎనిమిది సార్లు ఆమెకు అబార్షన్ చేయించాడని, కొడుకు కోసం తనకు స్టెరాయిడ్లు సైతం ఇప్పించాడని ఇక అలాంటి దుర్మార్గుడిని భరించడం తన వల్ల కాదని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఒక మీడియా పత్రిక తెలిపింది. అంత విద్యావంతుల ఇంటికి కోడలిగా వెళ్లినప్పటికీ ఇంగిత జ్ఞానం కూడా లేని అత్తింటివారు మరియు భర్త కారణంగా ఆ మహిళ ఎన్నో బాధలకు గురి అవ్వడం దురదృష్టకరం. అటువంటి వారికి కఠిన శిక్షలు విధించాలని నెటిజన్లు మరియు మహిళ సంఘాలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: