గల్లా..మీకు ఇది తగునా ? ఏమిటీ పని ?

అయ్యా నాకు న్యాయం చేయండి అంటూ ఆ రైతు పోలీసులను, అధికారులను ఎన్నోమార్లు వేడుకున్నాడు. న్యాయం జరగ లేదు. విధి లేక అతను కోర్టును ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయమూర్తికి వివరించాడు. కోర్టు బాధితుడి పక్షాన నిలిచింది. చర్యలు తీసుకోవాలని పోలీసులను అదేశించింది. దీంతో పోలీసులు కదిలారు. బాధితుడి వ్యతిరేకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆంధ ప్రదేశ్ చిత్తూరు జిల్లా తవణం పల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

 దిగువ మాఘం గ్రామంలో అదే గ్రామానికి  చెందిన రైతు గోపీ కృష్ణకు పొలం ఉంది. దీనిని అక్కడి పారిశ్రామిక వేత్తలు కబ్జా చేశారు. అతని పొలాన్ని ఆక్రమించి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. పారిశ్రామిక వేత్తలను అడ్డుకునే శక్తి లేని రైతు పోలీసులను ఆశ్రయించారు.  అక్కడ అతనికి నిరాదరణ ఎదురవడంతో న్యాయం కోసం కోర్టు గుమ్మం తొక్కారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తండ్రి, దివంగత  రాజగోపాల్ నాయుడు పేరుతో ఓ ట్రస్టు ఉంది. ఈ రాజన్న  ట్రస్ట్ పలు  కార్యక్రమాలు చేస్తుంటుంది.  అరుణకుమారి గతంలో మంత్రి గా పని చేసి ఉండటం, ఆమె కుమారుడు పార్లమెంటు సభ్యుడు కావడంతో ఈ ప్రాంతంలో వారిదే హవా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా.   రాజన్న ట్రస్ట్ ఎడ్యు కేషనల్ సొసైటీ అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణల పై రైతు గోపీ కృష్ణ వాదనలను విన్న కోర్టు చిత్తూరు నాలుగో అదనపు కోర్టు తెలుగుదేశం పార్టీ ఎం,పి, గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె భర్త రామచంద్ర నాయుడుతో పాటు మరో 12 మంది పై కేసు నమోదు చేయమని పోలీసులను అదేశించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా క్రిమినల్ ప్రోసీజర్ కోడ్  సెక్టన్ 120 బి, 506, 447,430, 109 తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

 రాజన్న ట్రస్టులో సభ్యులుగా ఉన్న  రామచంద్ర నాయుడు, అరుణకుమారి, జయదేవ్, పద్మావతి,  గోగినేని రమాదేవితో పాటు, ట్రస్టు కార్యదర్శి రామచంద్ర రావు పేరు ను నిందితుల జాబితాలో చేర్చారు.  వీరితో బాటు  గల్లా జయదేవ్ సంస్థ ఉద్యోగులతో పాటు  గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై కూడా కేసు నమోదు చేశారు.  ఈ విషయాన్ని చిత్తూరు డి.ఎస్.పి. సుధాకర్ ధృవీకరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా చలామణి అవుతున్న  గల్లా కుటుంబం చిల్లర చిల్లర గా వ్యవహరించడం, భూ ఆక్రమణలకు పాల్పడటం పారిశ్రామిక వర్గాలు విమర్శించాయి.  తొలుత రాజకీయ వేధింపులుగా భావించిన పారిశ్రామిక వర్గాలు, ఆ తరువాత ఇది రాజకీయవేధింపు కాదని నిర్దారణకు వచ్చారు.  గల్లా కుటుంబం కారణంగా నష్టపోయిన రైతు గోపీకృష్ణకు అండగా నిలవాలని వారు ముఖ్యమంత్రి వైె.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేెేశారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: