పరువు ఆత్మహత్య..ఎక్కడో  తెలుసా ?
 
ఆమె మైనర్ కాదు, మేజర్. నిరక్షరాస్యురాలు కాదు, విద్యావేత్త, పైగా డాక్టర్. ఆమెకు తనకంటూ ఇష్టా ఇష్టాలు ఉండకాడదు.  సొంతంగా  భవిష్యత్ ఆలోచనలు చేయకూడదు.  ఇదీ ఓ వైద్యురాలికి తల్లితండ్రులు  జారీ చేసిన హుకుం. కూతురు తనకు నచ్చిన వాడిని వివాహం చేసుకుందని తల్లితండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు.  ఈ ఘటన తమిళనాడు లోని తిరువళ్లురు జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువళ్లు రు సమీపం లోని ఊత్తుకోట సమీపాన ఉన్న  మాంబేడు గ్రామానికి  చెందిన అర్చన  వృత్తి రీత్యా వైద్యురాలు. చెన్నై నగరంలోని  ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఆమె తాను పని చేసే ఆసుపత్రిలో సహాధ్యాయిగా ఉన్న గణేశన్ అనే వ్యక్తిని ప్రేమించారు. అతను తమిళనాడు లోని అక్కరైపాకం గ్రామానికి చెందిన వ్యక్తి.  అర్చన తన ప్రేమ వివాహాన్ని తల్లి తండ్రులకు తెలిపారు. దీనికి అమె తల్లితండ్రులు అంగీకరించ లేదు. అతడ్ని వివాహం చేసుకుంటే తన వంశ పరువు పోతుందని వైద్యరాలిని హెచ్చరించారు. తల్లితండ్రులను  అంగీకరింప చేయడానికి అర్చన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అదే సమయంలో గణేశన్ కూడా తన ప్రేమ విషయాన్ని ఇంట్లో తెలిపారు. అక్కడ తొలుత ప్రతికూలత ఎదురైనా తరువాత అంగీకరించారు. ఎటోచ్చీ అర్చన కుటుంబంలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి.  వైద్యురాలు తల్లితండ్రులను ఎదిరించి తనకు నచ్చిన వాడితో వివాహం చేసుకుంది.  ఈ విషయాన్ని అంగీకరించ లేని వైద్యురాలి తల్లి సరళ నెల రాజుల పాటు ఇరుగు పొరుగు వారితో మూభావంగా గడిపింది. ఎవరన్నా పలుకరిస్తే... కూతురి మూలంగా తమ వంశ పరువు పోయిందని వాపోయేది.  తాజాగా అమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన సరళ భర్త మురుగన్ కూడా  భార్య మరణాన్ని తట్టుకోలేక పోయాడు. తాను కూడా నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి చుట్టు పక్కల వాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత దేశం స్వాతంత్య్ర అమృత మహహోత్సవాలు జరుపుకుంటున్న వేళ మానవ సమాజంలో ని కొందరు జన జీవన స్రవంతి లో కలవ లేకున్నారు. పరువంటూ తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: