దేశానికి సేవ చేసే అవకాశం లభించడం ఓ వరం. గుండెల నిండా ధైర్యంతో సరిహద్దుల్లో దేశానికి కాపలా ఉండే ఆక్షణం అందులో ఉండే గర్వం నిజమైన సైనికుడికే తెలుసు. కఠోర శ్రమ ఉంటే తప్ప అలాంటి అవకాశం దొరకదు. ఆ స్థానంలో ఉండి కొందరు నీచులు  తల్లి లాంటి దేశం గొంతునొకుతున్నారు. రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని  శత్రుదేశాలకు చేర్చుతూ మోసం చేస్తున్నారు. అందరిలో అందరిలానే ఉంటూ దేశ సేవ  చేస్తున్నామంటే బిల్డప్ ఇస్తూ దేశానికి సున్నం పెడుతున్నారు. డబ్బుల కోసం, అమ్మాయిల కోసం, మరో బలహీనత కోసం అమ్మలాంటి దేశాన్ని శత్రువుకు తాకట్టు పెడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రక్షణ రంగానికే రక్షణ లేకుండా పోయిందా..? ఇంటి దొంగలతోనే అసలు ప్రమాదమా..? ఇలాంటి వాటికి చెక్ పడాలంటే ఎలా..? ఇండియన్ సబ్ మెరైన్ కు సంబంధించిన కీలక సమాచారం లీక్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులు సహా ముగ్గురు అధికారులను సిబిఐ అరెస్టు చేసింది.

ఇందులో ముంబై లో పనిచేస్తున్న కమాండర్ స్థాయి అధికారి కూడా ఉన్నాడు. కెలోక్లాస్ సబ్ మేరైన్ ఆధునీకరణకు సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని నేవీ కమాండర్, విశ్రాంత ఉద్యోగులకు రహస్యంగా చేరవేశారని వెల్లడించాయి. అరెస్టయిన వారితో సంబంధాలున్న నేవి ఉద్యోగులను సిబిఐ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై ఇండియన్ నేవీ కూడా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ మధ్య వైజాగ్, అంతకుముందు బెంగళూరు, ఒడిస్సా, కోల్ కత్త ఒకటీ, రెండు శత్రు దేశాలకు, ఉగ్రవాద సంస్థలకు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసి దొరికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ డబ్బు రూపంలో అధికారుల నుంచి ఇలాంటి సమాచారం రాబట్టేందుకు కుట్రలు చేస్తోంది. తులసి వనంలో గంజాయి మొక్క ఉన్నట్లు, రక్షణ రంగంలో మేకవన్నె పులులు చాలా ఉన్నాయి. కాసులకు కక్కుర్తి పడి కొందరు, వగలాడి వలపులో చిక్కుకొని మరికొందరు  అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారు. కాస్త ఆనందం, కొన్ని కాసుల కోసం ఆత్మను చంపుకుంటున్నారు. బార్డర్లో చొరబడే ఉగ్రవాదులకంటే డిఫెన్స్ లో ఉన్న దొంగలే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: