
పోలీసులు వెంబడిస్తున్న కూడా వారి నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దొంగలు. పోలీసులకు షాక్ ఇచ్చే విధంగా దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇక్కడ ఒక దొంగల ముఠా కూడా పోలీసులకు ధూమ్ సినిమా చూపించింది. ఆంధ్రప్రదేశ్లోని కడప నగరంలో ఏటీఎం చోరీ సంచలనంగా మారిపోయింది. 42 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు దొంగలు.. దీంతో ఈ కేసుపై ఎంతో సీరియస్గా దృష్టి పెట్టారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో దొంగల ముఠా రాజస్థాన్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించి ఆ రాష్ట్రాలకు వెళ్లిపోయారు పోలీసులు.
అక్కడ లోకల్ పోలీసుల సహాయంతో దొంగలముఠా ని గుర్తించారు. అయితే ఇక నిందితులు దొంగతనం చేసిన తీరు గురించి తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు పోలీసులు. ఒక కంటైనర్ లో ఒక కారు ని తీసుకొని వచ్చిన దొంగల ముఠా.. అదే కారులో 5, 6 తేదీల్లో రెక్కీ నిర్వహించారు. చివరికి కడప శివారులో ఉన్న ఏటీఎం ను ఎంచుకొని చివరికి చోరీ చేసి 42 లక్షలు ఎత్తుకెళ్లారు. మళ్లీ కారును కంటైనర్ లోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. కాగా హైదరాబాద్లో కంటైనర్ను అక్కడే వదిలేసి కారులో చెక్కేసారు. ఈ క్రమంలోనే హర్యానా వెళ్లిన పోలీసులు నిందితుల ఇల్లు చెక్ చేయగా నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో వదిలివెళ్లిన కంటైనర్ లో చెక్ చేయగా అందులో ఉన్న ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి వద్ద కొన్ని లక్షల నగదుతో పాటు 20 కిలోల గంజాయి నాటు తుపాకులు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్ లాంటి ఎన్నో రకాల సామాగ్రిని సైతం చూసి షాక్ అయిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.