ఇటీవలి కాలంలో ప్రేమ అనేది ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రేమలో పడటం కొన్ని రోజులపాటు ప్రేమ లో ఉన్న అనుభూతితో సంతోష పడటం.. ఇక ఆ తర్వాత ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు అని.. లేదా ప్రేమను గెలిపించుకోలేక పోయాము అంటూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఘటనలు నేటి రోజుల్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇక అటు ప్రేయసి మోసం చేసిందని లేదా ప్రియుడు మోసం చేశాడని నేటి రోజుల్లో అక్కడితో జీవితం అయిపోయిందని ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య కూడా బాగానే ఉంది.


 ఇక ఇటీవలే గుంటూరు జిల్లా మంగళగిరిలో కూడా ఇలాంటి తరహా విషాదకర ఘటన జరిగింది అనే విషయం తెలిసిందే. ప్రేమలో విఫలం అయ్యాను అన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. నవ్వులూరి మక్కెవారి పేటకు చెందిన బుల్ల సంజయ్ అనే యువకుడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


 ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ తన మొబైల్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడంతోపాటు ఇక సూసైడ్ లెటర్ కూడా సెల్ ఫోన్లో బయటపడింది. ఈ క్రమంలోనే మృతుడి తండ్రి కోటేశ్వరరావు వీటిని పోలీసులకు అందించి ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఏపీఎస్పి ఆర్ఎస్ఐ రమేష్ తో పాటు అక్క చెల్లెలు నిరీష, సుజాత కారణము అంటూ వెల్లడించాడు. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఈ విషయం తనకు తెలియడం తో ఎక్కడ బయట పెడతానో అనే భయంతో వేధింపులకు  గురిచేశారని.. ఇక ప్రేమ పేరు చెప్పి నాటకమాడి నిరీష తన జీవితాన్ని నాశనం చేసిందని అందుకే  ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ సదరు యువకుడు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: