ఇటీవలి కాలంలో ఎక్కడచూసినా దొంగల బెడద మరీ ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ సభ్య సమాజంలో గౌరవంగా బతకడం కంటే దొంగతనాలకు పాల్పడటం ఇక అందినకాడికి దోచుకోవడం వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. దీంతో నేటి రోజుల్లో ఇలా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాం అంటే చాలు దొంగలు చేతివాటం చూపిస్తూ ఉన్నారు.


 ఇక ఎక్కడపడితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతూ ఎంతో మందిని బురిడీ కొట్టిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎంతో మంది సామాన్య ప్రజలు రోడ్డు పై నడుస్తున్న సమయంలో దొంగలు  చరవాణి దొంగలించడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  అయితే సామాన్య ప్రజల వరకు ఓకే గాని ఇటీవల ఏకంగా ఒక మాజీ పార్లమెంటు సభ్యుడికి కూడా ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా చేతుల్లో ఉన్న ఒక మొబైల్ ని గుర్తు తెలియని ఆగంతకుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. పెళ్లి లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ విజయ్ గోయల్ చేతుల్లో నుంచి ఫోన్ దొంగలించాడు ఒక దొంగ.


 విజయ్ గోయల్ దర్యాగంజ్ నుంచి రెడ్ పోర్టుకు వెళ్తున్నారు. ఇక 7:45 గంటల సమయం లో జామా మసీదు మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నాడు విజయ్ గోయల్.  ఈ క్రమం లోనే అక్కడికి ఎంతో వేగంగా వచ్చిన ఆగంతకుడు విజయ్ చేతుల్లో ఉన్న ఫోన్ లాక్కెళ్లాడు. దీంతో మాజీ ఎంపీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చివరికి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక ఫోన్ లాక్ ఎలా ఆ దొంగ గురించి గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: