ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆన్ లైన్ ఆర్డర్స్ చేస్తూ వస్తున్నారు.బద్ధకం పెరగడం లేదా..తొందరగా పని జరుగుతుంది అని చాలా మంది ఇదే ఆలోచనలో వున్నారు. అందుకే ఇప్పుడు ప్రతిదీ ఆన్ లైన్ మయం అయ్యింది. అందరూ ఈజిగా వుండే దీన్ని ఎంచుకుంటున్నారు. దాంతో ఆన్ లైన్ మార్కెట్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి వస్తువును కూడా ఇలానే విక్రయిస్తున్నారు..కాగా ఓ యువతి ఇలానే తనకూ కావలసిన వస్తువును ఆర్డర్ చేసింది. చివరికి దారుణంగా మోస పోయింది. 10 రుపాయిలు అని ఏకంగా 49 వేలకు టోకరా పెట్టారు..ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేస్తున్న వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.


ఏంటో ఏది నమ్మాలని అనుకున్నా కూడా భయం వేస్తుంది.ఎక్కడ ఏది మనకు తెలియకుండానే మనల్ని మోసం చెస్తుందొ ఈరోజుల్లో తెలుసుకోవడం చాలా కష్టం అయ్యింది. పాపం ఇప్పుడు యువతి పరిస్థితి కూడా అటువంటిదే.. తనకూ ఇష్టమైన వైన్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. అందుకు ముందే డబ్బులు చెల్లించింది. అయితే టిప్ ఇవ్వాలి అంటూ మరో ఫోన్ కాల్ వచ్చింది. అది నమ్మిన యువతి వాళ్ళు చెప్పిన విధంగా చేసింది. అకౌంట్ లో డబ్బులు కాళీ అవ్వడం తో షాక్ అయ్యింది.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.బెంగళూరులోని లాల్‌బాగ్‌రోడ్డు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 22 ఏళ్ల యువతి.. కిందటి నెల 22వ తేదీన ఎంతగానో ముచ్చటపడి తనకిష్టమైన వైన్ ఆర్డర్ ఇచ్చింది. ఆమె ఓ వెబ్‌సైట్‌ద్వారా ఈ ఆర్డర్ ప్లేస్ చేసింది. కొద్ది సేపటి తర్వాత మరో కాల్ వచ్చింది. దాన్ని రిసివ్ చేసుకున్న యువతి 540 పే చేసినట్లు చెప్పింది. అంతేకాదు 10 డెలివరీ చార్జిలు కూడా ఇవ్వాలని సదరు వ్యక్తి కోరారు. అయితే అతను చెప్పిన విధంగా కాసెపటికి ఓటిపి వచ్చింది. దాన్ని అతనికి చెప్పింది. అంతే క్షణాల్లో 49 వేలు పోయాయి..వెంటనే యువతి పోలీసులను ఆస్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: