
టీచర్ మందగించిందని.. ప్రియురాలి తో గొడవ జరిగిందని.. తల్లిదండ్రులు తిట్టారని ఇలా చిన్నచిన్న కారణాలతోనే ఎంతోమంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెరసి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నిండిపోతుంది . అదే సమయంలో ఇటీవలి కాలంలో ఇష్టం లేని చేస్తున్న కారణంగా ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఎందుకో పెళ్లి విషయంలో మాత్రం తీరును మార్చుకోవడం లేదు. చివరికి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి పిల్లల బలవన్మరణాలకు కారణం అవుతున్నారు. ఓ యువతి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని చివరికి ఆత్మహత్య చేసుకుంది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల కు చెందిన బీరయ్య కు ముగ్గురు కుమార్తెలు. కాగా మూడో కూతురు చామంతి కి జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి కి చెందిన సంజీవులు కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు బీరయ్య. అయితే అప్పటికే సంజీవ్ కు పెళ్లి జరిగి భార్య చనిపోయింది. దీంతో అతనికి రెండో భార్య కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని భావించాడు తండ్రి. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఎంతో మనస్థాపం చెందింది సదరు యువతి. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారు అంటూ ప్రతిరోజు కుంగిపోతూ ఉండేది. ఇటీవలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చివరికి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది..