
ఇలా ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏడాది క్రితం ఆ ఇద్దరికీ పెళ్లి అయింది. అయితే ఇక వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు. కానీ ఇటీవల భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తికి ఏడాది క్రితం పెళ్లి జరుగగా ఇక పెళ్లి అయిన మరుసటి రోజు నుంచి అతని భార్య వేరే యువకుడితో ఫోన్లో మాట్లాడుతూ వచ్చింది. కొన్ని రోజుల పాటు పెద్దగా పట్టించుకోని భర్త ఆ తర్వాత భార్య తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఓ రోజు భార్య ఫోన్ చెక్ చేసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆమె వాట్సాప్ లో అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు సదరు యువకుడు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయాడు. ఫోన్ పగలగొట్టి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ భార్య తీరులో మాత్రం మార్పు రాలేదు. వేరొక యువకుడితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇక తీవ్ర మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.