ఒకసారి పెళ్లి అనే బంధంతో ఒక్కటైన తర్వాత ఇక  భర్త నాకే సొంతం అనుకుంటూ ఉంటుంది ఏ మహిళ అయినా సరే. తన భర్త వైపు ఎవరైనా మహిళ కన్నెత్తి చూసిన కూడా అస్సలు సహించదు అన్న విషయం తెలిసిందే. అలాంటిది భర్త ఇక వేరే మహిళల పట్ల ఆకర్షితుడు అయితే ఏకంగా వార్నింగులు ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఎంతో మంది మహిళా మణులు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం అందరి కంటే కాస్త భిన్నం గా ప్రవర్తించింది. భర్త చేసే పాడుపని తప్పు అని చెప్పాల్సింది పోయి వంత పాడటం మొదలు పెట్టింది. తప్పు అని చెప్పాల్సిన భార్య చివరికి పక్కనుండి మరి ప్రోత్సహించింది.


 భర్త ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తున్న సమయంలో పక్కనే ఉండి వీడియోలు కూడా తీసి మరింత ఎంకరేజ్ చేసింది భార్య. ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. బాడౌన్ లోని ఈనెల 12వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ నివాసం ఉంటుంది. వీరీ ఇంటి పక్కనే ఓ ఇంట్లో ఒక మైనర్ బాలిక ఉంది. ఇక తెలిసిన వారే కావడంతో మైనర్ బాలిక తరచూ వారి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే  సదరు బాలికపై ఆ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి కన్నుపడింది. ఎలాగైనా బాలికపై లైంగిక వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయం ఏకంగా భార్యకు చెప్పాడు. భార్య తప్పు అని చెప్పాల్సింది పోయి సహాయం చేయడానికి ఒప్పుకుంది.


 ఈ క్రమంలోనే ఓ రోజు మైనర్ బాలికను ఇంటికి పిలిపించి మాయమాటలు చెప్పి భర్త గదిలోకి పంపించింది. ఈ క్రమంలోనే భర్త బాలికపై అత్యాచారం చేశాడు. ఇదే సమయంలో భార్య పక్కనే ఉండి వీడియో చిత్రీకరించడం గమనార్హం. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో పెడతాము అంటూ బెదిరించారు. ఇక రెండు రోజుల తర్వాత నిందితులు చెప్పినట్లుగానే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భయపడిన బాధితురాలు జరిగిన ఉదంతం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: