సంతోషంగా సాగిపోతున్న వారిని చూసి విధి అప్పుడప్పుడు ఓర్వలేక పోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే  కుటుంబంలో ఏదో ఒక రూపంలో విషాదాన్ని నింపుతూ చివరికి ఆ కుటుంబానికి అరణ్య రోదన   మిగిలుస్తూ వుంటుంది. ఇక ఇలాంటివి చూసినపుడు వీధి ఎంత కఠినమైన అని ప్రతి ఒక్కరి మనసు తరుక్కుపోతుంది  ఉంటుంది అని చెప్పాలి.  ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందినది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఒక్కగానొక్క కొడుకు అది కూడా పెళ్లి అయిన 20 ఏళ్ల తర్వాత ఎన్నో పూజలు చేస్తే పుట్టాడు. దీంతో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొడుకే ప్రపంచంగా బ్రతికే గారు. ఇటీవలే కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక కుమారుడికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి తమ బాధ్యతలను కూడా తీర్చుకున్నారు ఆ వృద్ధ దంపతులు. ఇక ఆ తర్వాత కొడుకు కోడలు తమను ఎంతో సంతోషంగా చూసుకుంటారు అని భావించారు. కానీ అంతలోనే వారిని విధి చిన్నచూపు చూసింది. పెళ్లయి 20 రోజులు కూడా కాలేదు అంతలోనే రోడ్డు ప్రమాదం వారి కుటుంబంలో విషాదం నింపింది.  అనుకోని ప్రమాదం కారణంగా చివరికి కొడుకు ప్రాణాలు విడిచాడు.



 తీవ్రగాయాలతో కోడలు ఆసుపత్రిలో చేరింది. అయితే పెళ్లి అయిన 9 రోజుల తర్వాత ఇలాంటి  ఘటన జరగడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఈ ఘటన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రానికి చెందిన ములకలపల్లి రాములు, మైసమ్మ దంపతులు హైదరాబాదులో నివాసం ఉండేవారు. అక్కడే వాచ్మెన్ గా పని చేసేవాడు రాములు. కుమారుడు వీరభద్రం ను ఎంత కష్టపడి చదివించారు.ఇటీవలే తమ సొంత ఊరు వచ్చేసారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంకు చెందిన మేనమామ కూతురుని వీరభద్రంకు పెళ్లి చేశారూ. కానీ పెళ్లయిన తొమ్మిది రోజులకు చివరికి విషాదం నెలకొంది.  ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: