విధి ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఊహించనీ విధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఊహించని రీతిలో విషాద నిండి పోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మొదటి కాన్పులో నే  కొడుకు పుట్టాడు. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


 రెండు కుటుంబాలు కూడా ఎంతో ఆనందంలో మునిగి పోయాయి. ఆ బాలుడికి పేరు పెట్టేందుకు బారసాల నిర్వహించాలని ముహూర్తం కూడా ఖరారు  చేసారు. కానీ ఇలా అందరూ ఆనందంలో ఉన్న సమయంలో విధి మాత్రం చిన్న చూపు చూసింది. పాము కాటు రూపంలో చివరికి తల్లిని అభం శుభం తెలియని ఆ చిన్నారి బాలుడికి దూరం చేసిందనే చెప్పాలి. పాము కాటు కారణంగా బాలింత చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన పెద్ద ముళ్ లో వెలుగులోకి వచ్చింది. గోపాలపూర్ గ్రామానికి చెందిన జ్యోతి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలి పనులు చేసుకుంటూ వీరి కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేది.


 అయితే గత నెల 29వ తేదీన జ్యోతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతలో ఆమె తల్లిదండ్రులు గోపాల్ పూర్ కి తీసుకెళ్లారు. కాగా బారసాల మరో మూడు రోజుల్లో జరగాల్సివుంది. అయితే ఇటీవల తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు. సాయంత్రం జ్యోతి తల దువ్వుకుంటూ ఉన్న  సమయంలో  దువ్వెన కింద పడింది. దాన్ని తీసుకుంటున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన పాము కాటు వేసింది. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్లారు. అయితే నగరానికి వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఇలా నెలలునిండనీ చిన్నారి తల్లిని కోల్పోవడంతో అందరూ కన్నీరుమున్నీరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: