ఇటీవల కాలంలో ఎక్కడచూసినా దొంగల బెడద కాస్త ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించాయి అంటే చాలు ఇక ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన యజమానులకు ఊహించని షాక్ తగులుతుంది. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తు ఉండటం గమనార్హం. అయితే పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం వెతికినా ఆచూకీ దొరకని పరిస్థితి ఏర్పడింది. అంతలా అప్డేట్ అయిపోయారు దొంగలు.


 ఈ క్రమంలోనే పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అయితే ఇలా దొంగల బెడద కేవలం మనదేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా దొంగతనానికి వచ్చిన వారు పోలీసులకు దొరికిపోయేలా వారికి తెలియకుండానే ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక ఆ క్లూ పట్టుకొని తీగలాగితే డొంక కదిలింది అనే విధంగా పోలీసులు విచారణ చేపడుతూ ఉంటారు. ఇక మరికొన్ని సార్లు దొంగలు  కాస్త విచిత్రంగా దొరికిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.


 ఇక ఇటీవల చైనాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. చైనా పూజియన్స్ ప్రావిన్స్ ప్రాంతంలో ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసులు వచ్చి చెక్ చేస్తే ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే అక్కడ కాలిపోయిన మస్కిటో కాయిల్స్ ని బట్టి దొంగలు రాత్రంతా అక్కడే ఉన్నారు అని పోలీసులు ఒక అంచనా వేశారు. అలాగే గోడ పై చనిపోయిన దోమ కనిపించింది. ఇక దాని రక్తాన్ని ల్యాబ్కు పంపించి  అత్యాధునిక టెక్నాలజీతో డిఎన్ఏ టెస్ట్ చేశారు. వచ్చిన రిపోర్టులతో పాత నేరస్తుల లిస్ట్ చెక్ చేశారు. ఈ క్రమంలోనే అందులో ఒకరి ది మ్యాచ్ అయింది అతని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: