సాధారణంగా ఈ సృష్టిలో ప్రమాదకరమైన జంతువులు ఏవైనా ఉన్నాయంటే వాటిలో మొసలి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవికి రారాజు సింహం అయితే మాత్రం నీటిలో ఉంటే సింహాన్ని కూడా భయపెట్టే బలం కలిగి ఉంటుంది మొసలి. అందుకే నీటిలో ఉన్నంతసేపు మొసలి జోలికి వెళ్లడానికి ఇక సింహాలు లాంటివి కూడా అస్సలు సాహసం చేయవు అని చెప్పాలి. నీటిలో ఉలుకు పలుకు లేకుండా  నక్కినక్కి ఉండే మొసలి ఎంతో చాకచక్యంగా వేటాడటం చేసి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఇక అడవి దున్నలాంటి భారీ జంతువుల సైతం అలవోకగా తన నోటితో పట్టి ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇలా అడవుల్లో మొసళ్లు ఎంత దారుణంగా వేటాడుతాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోయాయి.. ఇలాంటివి చూసినప్పుడు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో ప్రమాదకరమైన మొసళ్లు  ఏకంగా జనాభాసాల్లోకి కూడా వస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఏకంగా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొసళ్లు ప్రత్యక్షమవుతూ ఉండడంతో ఎంతో మంది జనాలు భయాందోళనకు గురవుతున్నారు..


 రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లోని అత్తాపూర్ లో కూడా ఇలాంటి తరహా ఘట్టనే జరిగింది. జనావాసాల్లో మొసలి కలకలం సృష్టించింది. మూసీ నది కాలువలో కొట్టుకొచ్చిన మొసలి అత్తాపూర్ లోని ఓ చోట బండరాయి దగ్గర సేదతీరుతూ ఉండడాన్ని జనాలు గమనించారు. సాధారణంగా మొసలిని చూడగానే అందరిలో భయం కలుగుతుంది. కానీ ఇక్కడ జనాలు మాత్రం భయపడటం కాదు ఆ మొసలిని చూడడానికి ఎగబడ్డారు.. ఇటీవల జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట క్రస్ట్ గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేయడంతో మొసలి కొట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక అడవి శాఖ అధికారులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: