జమ్ము కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు మొత్తం ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి ప్రశాంత వాతావరణన్ని మళ్లీ ఉద్రిక్తంగా మార్చేందుకు అటు పాకిస్తాన్ నుండి ఎంతోమంది ముష్కరులు భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మారణ హోమాలు  సృష్టించేందుకు ఎక్కడికక్కడ ఉగ్ర కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే భారత బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వివిధ ఆపరేషన్ నిర్వహిస్తూ ఇక అటు ముష్కరులను  మట్టు పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


 ఇలా జమ్మూ కాశ్మీర్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఉగ్రకుట్రలకు ప్లాన్ చేస్తున్న వారి స్థావరాలని టార్గెట్గా చేసుకొని వివిధ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది భారత ఆర్మీ. ఈ క్రమంలోనే ఇక అన్ని ప్రాంతాలలో జల్లడపడుతూ ఉగ్రవాదులు కనిపిస్తే చాలు దారుణంగా ఎన్కౌంటర్ చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల దగ్గర నుంచి భారీగా మందు సామాగ్రిని తుపాకులను కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ఇలా గత కొన్ని నెలల నుంచి వందల మంది ముష్కరిలను మట్టు పెట్టింది భారత ఆర్మీ. ఇక ఇటీవల కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది.


 ఏకంగా ఎంతో చాక చక్యంగా ఆపరేషన్ నిర్వహించిన భారత ఆర్మీ నలుగురు ముష్కరులను కూడా మట్టు పెట్టింది అని చెప్పాలి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల స్థావరాలు లక్ష్యం గా భారత భద్రత బలగాలు దాడులు జరిపాయి. ఈ క్రమం లోనే ఆనంత్ నాగ్ లోని బీచ్ బెహరా లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అవంతి పురలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ముగ్గురిని మట్టు బెట్టాయి భారత బలగాలు. ఇందులో ఒకరు లస్కరే తోయబా ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్  ముక్తర్ బట్  గా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: