సాధారణంగా యువతి యువకులు మధ్య ప్రేమ పుట్టడం అనేది సహజం. అయితే ఇలా ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ కొన్ని కొన్ని సార్లు పెళ్లి వరకు వెళ్తే.. మరి కొన్నిసార్లు తక్కువ సమయంలోనే బ్రేకప్ చేసుకుని విడిపోయే వరకు వెళుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్నిసార్లు ప్రేమ విషాదాన్ని  నింపుతూ ఉంటుంది. కొన్నిసార్లు లవ్ స్టోరీ లో ఊహించునటువంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయ్. ఇకపోతే బీహార్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. బీహార్ కు చెందిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇక ఇద్దరు కొన్నాళ్లుగా ఎవరికి తెలియకుండా గుట్టుగా ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.


 ఇక ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇంట్లో రహస్యంగా కలిసేంతవరకు కూడా వీరి ప్రేమ వ్యవహారం వెళ్ళింది అని చెప్పాలి. అయితే ఓ రోజు రాత్రి ప్రేయసి గదికి అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళాడు ప్రియుడు. అదే రోజు ఇంట్లో చప్పులు విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నిద్రలో నుంచి మేలుకున్నారు. ఇది గమనించిన ప్రియుడు అక్కడ నుంచి బయటకు పరుగులు పెట్టాడు. ఇక ఎలాగైనా ప్రియుడి కుటుంబ సభ్యులకు చిక్క వద్దు అనే భావించి ఎదురుగా కనిపించిన ఒక బావిలో దూకేశాడు యువకుడు. చాప్రా లోని మోతీరాజ్ పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. మున్నా రాజ్ అనే యువకుడు ఇలా ప్రేయసి కుటుంబ సభ్యుల నుంచి తప్పించుకోవడానికి బావిలో దూకాడు.


 దీంతో వెంటనే ప్రేయసి కుటుంబ సభ్యులు ఇతర గ్రామస్తులు అందరూ కూడా బావి చుట్టూ చేరి ఆ యువకుడ్ని సురక్షితంగా బావిలో నుంచి బయటకు తీశారు. దీంతో అప్పటివరకు రహస్యంగా నడిపిన ప్రేమాయణం కాస్త ఇక గ్రామం మొత్తం తెలిసిపోయింది. ఈ క్రమంలోనే కలగజేసుకున్న గ్రామపంచాయతీ పెద్దలు అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి సర్దు చెప్పారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆ జంటకు పెళ్లి చేశారు. ఇలా ఒకరకంగా ఆ యువకుడు బావిలో దూకడం అతనికి అదృష్టాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పాలి. ఇక పెళ్లి జరుగుతుందో లేదో అన్న టెన్షన్ లో ఉన్న వారికి ఏకంగా పెద్దల అంగీకారంతో గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: