పుట్టినవాడు గిట్టక  తప్పదు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఇది నిజమే.  ఎందుకంటే.. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎంతో గొప్ప వ్యక్తి అయినా సరే చివరికి చనిపోయి మట్టిలోకి వెళ్లాల్సిందే. అయితే ఇటీవలే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే మాత్రం మృత్యువు ఇలా కూడా దూసుకు వస్తుందా అనే భయం ప్రతి ఒక్కరిలో పేరుకుపోతుంది అని చెప్పాలి. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం క్షణాల వ్యవధిలో ఎంతోమందిని కబలిస్తుంది. కనీసం తప్పించుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పాలి.


 ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది హర్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. ఇక మరికొంతమంది ఊహించని ప్రమాదాలు దూసుకురావడంతో చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. తాను తన మానానా హోటల్లో కూర్చుని పని చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఊహించని రీతిలో అతనిని మృత్యువు కబలించింది అతను మృత్యువు  గురించి తప్పించుకునేందుకు వీలే లేకుండా పోయింది అని చెప్పాలి.


 గుజరాత్ లోని సూరత్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న టీ దుకాణంలో కస్టమర్లు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి కూర్చిలో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. అయితే పక్కనే ఉన్న బాలుడు ఇక కస్టమర్ల కోసం టీ తయారు చేస్తూ ఉన్నాడు. కానీ అంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి దుకాణం లోకి దూసుకెళ్లింది. ఏకంగా దుకాణం ముందు ఉన్న అద్దాలను వస్తువులను కూడా ధ్వంసం చేసుకుంటూ లోపలికి దూసుకుపోయింది అని చెప్పాలి. వ్యక్తి పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇక కుదరలేదు. దీంతో దురదృష్టవశాత్తు వాహనం కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఇంకొందరు స్వల్పంగా గాయపడ్డారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: