ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల్లో మోసాలు జరగడం ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా పెట్రోల్ బంకుల్లో సెన్సార్లను సెట్ చేసి ఇక పోయాల్సిన పెట్రోల్ కంటే తక్కువగా పోస్తూ ఇక మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అంతేకాదు ఇక నాణ్యతలేని పెట్రోల్ పోస్తూ ఉండడం అలాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటివి జరిగినప్పుడు వాహనదారులు పెట్రోల్ బంకు సిబ్బందిని ప్రశ్నించడం లాంటి ఘటనలు కూడా  వెలుగు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో మాత్రం దారుణ ఘటన జరిగింది. ఏకంగా పెట్రోల్ తక్కువ పోసారంటు ప్రశ్నించిన భార్యాభర్తల పై పెట్రోల్ బంకు సిబ్బంది కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన మీరట్లో జరిగినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు పిల్లలతో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. అయితే అక్కడ పెట్రోల్ పోయించుకున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఇక తక్కువ పెట్రోల్ పోశారు అనే విషయాన్ని గ్రహించి ఇక వారిని ప్రశ్నించారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బందికి సదరు భార్యాభర్తలకు మధ్య మాట పెరిగింది. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది విచక్షణ రహితంగా భార్యాభర్తలు పిల్లలపై కర్రలతో దాడి చేశారు. అక్కడున్నవారు అప్రమత్తమయి ఇక పెట్రోల్ బంక్ సిబ్బంది నుంచి భార్యాభర్తలను కాపాడారు. ఇక ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.


 రామ రాజ్యం ఉత్తరప్రదేశ్ లో ఉందా.. మీరట్లో పెట్రోల్ బంక్ సిబ్బంది గూండాఇజం చెలాయించారు. భార్య భర్తలు మరియు పిల్లలను దారుణంగా కరలతో కొట్టారు. తక్కువ పెట్రోల్ పోయడాన్ని ప్రశ్నించినందుకు ఇలా ప్రవర్తించారు అంటూ ఇక నెటిజన్ ఒక వ్యాఖ్యను జత చేస్తూ ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయగా వెంటనే పెట్రోల్ బంక్ ఇబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: