ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోతుంది . ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా ఈ టెక్నాలజీ మీద ఆధారపడుతూ ఉన్నాడు మనిషి. టెక్నాలజీ కారణంగా మనిషి జీవితం ఎంతో సులభతరం అయింది అని భావిస్తూ ఉన్నాడు. కానీ కొన్ని కొన్ని సార్లు పెరిగిపోయిన టెక్నాలజీ కూడా బడిసి కొట్టి చివరికి మనిషి ప్రాణాలు మీదికి తెస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఎక్కువగా చన్నీటితోనే స్నానాలు చేసేవారు. ఇక ఆ తర్వాత కాలంలో కొంతమంది వేడినీటి స్నానం చేయడం కూడా మొదలుపెట్టారు. ఇక ఇటీవల కాలంలో మాత్రం ఎండాకాలమైనా వానాకాలం అయినా ఏ కాలమైనా సరే చివరికి వేడి నీటితోనే స్నానం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఒకప్పుడు హీటర్ను పెట్టుకోవడం చేసి ఇక నీటిని వేడి చేసుకునేవారు. లేదంటే గ్యాస్ పై నీరును వేడి పెట్టుకునే వారు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది టెక్నాలజీతో కూడిన గీజర్ను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. గీజర్ ఉపయోగించి ఇక ప్రతిరోజు సులభంగానే వేడినీటి స్నానం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని ఇళ్లల్లో మాత్రం ఇలా వేడినీటి స్నానం కోసం తెచ్చుకున్న గీజర్లు చివరికి ప్రాణాల మీదికి తెస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న గీజర్ పేలిన ఘటన గురించి మరిచిపోకముందే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 బాత్రూంలో గీజర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో చివరికి ఊపిరి ఆడక నవవధువు మృత్యువాత పడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మీరట్ కు చెందిన నవవధువు స్నానం చేసేందుకు బాత్రూం కు వెళ్ళింది. అయితే ఎంతసేపటికి కూడా ఆమె బయటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందా అని వెళ్లి చూసారు. దీంతో నవవధువు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు.  వెంటనే ఇక తలుపులు బద్దలు కొట్టి ఆసుపత్రికి తరలించారు. అయితే గీజర్ నుంచి లీక్ అయినా కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే నవవధువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: