
వెరసి నేటి రోజుల్లో ఇలా చోరీలకు సంబంధించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక కొన్ని కొన్ని చోరీల గురించి తెలిసి అయితే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. సాధారణంగా చోరీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది.. ఇంట్లోకి చొర పడటం బంగారం నగలు విలువైన వస్తువులను దోచుకు వెళ్లడం మాత్రమే. కానీ ఇటీవల కాలంలో దొంగలు మాత్రం ఏకంగా సెల్‌ఫోన్ టవర్లను రైలు ఇంజన్లను సైతం దొంగతనాలకు పాల్పడుతూ ఉండడం అందరినీ నోరేళ్ల పెట్టేలా చేస్తుంది. ఇక ఇటీవల బీహార్ లో కూడా ఇలాంటి తరహా ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
మొన్నటికి మొన్న రైల్ ఇంజన్ దొంగతనం చేసిన ఘటన గురించి మరవకముందే.. ఇక ఇటీవల ఏకంగా రైల్వే ట్రాక్ ను ఎత్తుకు వెళ్ళిన చోరీ ఘటన వెలుగు చూసింది. ఏకంగా రెండు కిలోమీటర్ల వేగిన రైల్వే ట్రాక్‌ను చోరీ చేశారు. సమస్తిపూర్ రైల్వే డివిజన్లో లోహత్ షుగర్ ఫ్యాక్టరీ కోసం పౌండన్ స్టేషన్ నుంచి లోహత్ వరకు రైల్వే ట్రాక్ వేశారు. అయితే కొన్నాళ్ల క్రితం ఫ్యాక్టరీ మూత పడింది. దీంతో రైల్వే ట్రాక్ ని కూడా మూసేశారు. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే ట్రాక్ ను ఎత్తుకు వెళ్లారు. ఈ చోరీ వెనుక రైల్వే ఉద్యోగుల అండదండలు కూడా ఉన్నాయి అన్నది తెలుస్తుంది.