సాధారణంగా అడవుల్లో ఉండే క్రూరమైన మృగాలలో పులి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే ఒక్కసారి పులికి ఆకలేసింది అంటే చాలు ముందు ఉన్నది ఎంతటి జంతువైనా సరే దారుణంగా వేటాడి దాన్ని ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అందుకే పులి పేరు చెబితే చాలు మనుషుల విన్నులు వణుకు పుడుతుంది అని చెప్పాలి ఇక ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు తమ కళ్ళ ముందు పులి కనిపించింది అంటే ఇక ప్రాణాలు దారిలో కలిసి పోయినంత పని అవుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇక్కడ మాత్రం ఒక దారుణమైన ఘటన జరిగింది. ఏకంగా మనుషులు క్రూరమైన పులిని వేటాడి వండుకొని తిన్నారు. ప్రకాశం జిల్లాలో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలో ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పలు  ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా విద్యుత్ తీగల పెట్టి ఇక జంతువులను వేటాడటం లాంటివి చేస్తూ ఉంటారని ఆరోపణలు ఉన్నాయి.


 అయితే అదే ప్రాంతం  లో పులి సంచరిస్తుంది అని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు సేకరించారు. అయితే పులికి కరెంటు తీగలు పెట్టి చంపేశారని.. ఇక తోలును అడవిలో ఉన్న బావిలో వేసి మాంసాన్ని మాత్రం వండుకొని తిన్నారని ఎర్రగొండపాలెం లోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఫారెస్ట్ రేంజ్  ఆఫీసర్ పులిని వండుకొని తిన్నారు అన్న వార్త పూర్తిగా అవాస్తవం అంటూ తెలిపారు. కాలు ముద్రల ఆధారంగా ఎప్పటిలాగానే అడవిలో మూడు పులులు సంతరిస్తున్నాయి అన్న విషయం తెలుసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే పులిని చంపి తిన్నారు అంటూ వస్తున్న వార్తలపై ఇంకా దర్యాప్తును ముగించలేదు అంటూ చెప్పుకొచ్చారు ఫారెస్ట్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: