ఒకప్పుడు ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు అడిగినా కూడా అప్పు ఇచ్చేవారు ఎవరు ఉండేవారు కాదు. కానీ నేటి రోజుల్లో మాత్రం అడగకపోయినా అప్పు ఇస్తాము అంటూ ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు, లోన్ యాప్స్ కూడా బ్రతిమిలాడుతూ ఉన్నాయి. దీంతో తరచూ ఫోన్ కాల్స్ చేసి రుద్ది రుద్ది మరీ లోన్స్ ఇస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా అవసరాలు తీర్చుకోవడానికి లోన్స్ తీసుకున్నవారు. ఆ తర్వాత లోన్ యాప్ వేధింపులకు గురవుతున్నారు.


 ఇటీవల కాలంలో అయితే ఇలా లోన్స్ యాప్ వేధింపులు మరింత మితిమీరిపోతూ ఉన్నాయని చెప్పాలి. దీంతో ఇక ఇలా లోన్ యాప్స్ వేధింపులు తాలలేకపోతున్న ఎంతోమంది యువతి యువకులు మనస్థాపనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు లోన్ తీసుకున్న మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించలేదు అని చెబుతూ వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇటీవలే కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఇలాంటిదే జరిగింది.



 చర్లపల్లి కి చెందిన మహమ్మద్ అనే యువకుడు లోన్ యాప్ యాప్ వేధింపులకు గురయ్యాడు. విజయవాడ పాల ఫ్యాక్టరీ లో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు మహమ్మద్. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్ లో లోన్ తీసుకున్నాడు. అయితే డబ్బు సమయానికి తిరిగి చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ కట్టాలి అంటూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. ఇక అతను ఇచ్చిన రిఫరెన్స్ కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేసి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ దుర్భాషలాడుతూ ఉన్నారు. దీంతో పరువు పోయిందని ఎంతగానో బాధ పడిపోయిన సదరు యువకుడు చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి రెండేళ్ల క్రితం వివాహం జరగగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: