ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ పని చేయాలన్నా కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కావాల్సింది పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ఇస్తే సరిపోతుంది అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంత ప్రయోజనం చేకూరుతుందో ఇక అన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏకంగా సోషల్ మీడియా పెడుతున్న చిచ్చుల కారణంగా మనుషుల మధ్య ఉన్న మానవ బంధాలు తెగిపోతున్నాయి.


 అంతేకాదు ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న అనర్ధాలు కారణంగా ఏకంగా  మనుషులు మరో సాటి మనిషి ప్రాణం తీసేందుకు కూడా వెనకాడని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న అనర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా సోషల్ మీడియా కారణంగా ఒక ప్రాణం బలి అయింది. ఒక యువకుడు తన ప్రియురాలి నగ్న వీడియోలను తన ఫోన్లో భద్రపరుచుకున్నాడు. కానీ ఆ యువకుడి స్నేహితుడు అతనికి తెలియకుండా ఫోన్లో ఉన్న అతని ప్రియురాలు నగ్న వీడియోలను తన ఫోన్ కి పంపించుకుని సోషల్ మీడియాలో పెట్టేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా యువతిని తన కోరిక తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్నేహితుడు అతన్ని చంపేశాడు. కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. దినేష్ తన లవర్ నగ్న వీడియోలను ఫోన్లో ఉంచుకోగా.. అతని ఫ్రెండ్ మురళి వీటిని తన ఫోన్ లోకి పంపించుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నించడమే కాదు ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న దినేష్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మురళిని దారుణంగా హత్య చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: