మొన్నటి వరకు అడవుల్లో ఉన్న కోతుల గుంపులు ఇక ఇటీవల కాలంలో జనావాసాల్లోకి వస్తు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఎన్నో ఇళ్లను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎంతోమంది పై దాడి చేసి గాయాలపాలు చేస్తూ ఉన్నాయి. ఇక కొన్ని కొన్ని సార్లు అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కూడా తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు కొంతమంది ఆలోచిస్తున్నారు అని చెప్పాలి.


 ఇక్కడ గ్రామ పెద్దలు ఇలాంటిదే చేశారు. ఆ గ్రామంలో కోతలు బెడద విపరీతంగా పెరిగిపోయింది. దీంతో గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే గ్రామ పెద్దలు ఒక సరి కొత్త ఆలోచన చేశారు. కోతులను పట్టుకోవాలి అంటూ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో కోతికి 500 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు అని చెప్పాలి. కాకినాడ రూరల్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 10 గ్రామాల్లో కోతుల వలన రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉండడం... ఇక ఇండ్ల మీద పై కోతులు స్వైర విహారం చేస్తూ అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి.



చిన్నపిల్లలపై కూడా దాడికి పాల్పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోతలు బెడద నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఇక ఆయా గ్రామాల సర్పంచులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా కోతులు పట్టుకుని అడవిలో వదిలిపెట్టిన వారికి ఒక్కో కోతికి 500 రూపాయల బహుమతి ఇస్తాము అంటూ ప్రకటించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఆఫర్కు ఆకర్షితులైన కొంతమంది కోతులను పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: