
ఇక కొంతమంది కేటుగాళ్లు అయితే ఇలా అక్రమాలకు పాల్పడేందుకు ఎంచుకున్న దారులు ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేల చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా సినిమాల్లో చూపించినట్లుగా కాదు అంతకుమించి అనేంతలా ఎంతోమంది బంగారం గంజాయి లాంటివి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఎంతోమంది విదేశీ వ్యక్తులు లేదా ఇండియాకు చెందినవారు ఇలా ఎయిర్పోర్టులలో అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేయడంని ఎన్నోసార్లు చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా విమాన సిబ్బందిలో ఒక వ్యక్తి బంగారం స్మగ్లింగ్ కి పాల్పడ్డాడు.
ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది ఒకరు బంగారం స్మగ్లింగ్ కి పాల్పడి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. వాయనాడ్ కు చెందిన షఫీ అనే ఉద్యోగి సుమారు కిలోన్నర బంగారం పేస్టును తన చేతులకు చుట్టుకుని దర్జాగా బహ్రయిన్ నుంచి కోజీ కోడ్ కు చేరుకున్నాడు. అయితే ముందస్తు సమాచారంతో కస్టమ్స్ అధికారులు శమీని అదుపులోకి తీసుకుని చెక్ చేయగా బంగారం బయటపడింది. ఈ క్రమంలోనే బంగారం మొత్తాన్ని సీజ్ చేసిన అధికారులు అతని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటన కాస్త మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇన్నాళ్లు కేవలం అక్రమార్కులు మాత్రమే ఇలాంటి పనులు చేయక ఇక ఇప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన సిబ్బంది ఇలాంటి పనులు చేస్తూ ఉండడంతో అధికారులు సైతం షాక్ అవుతున్నారు.