అత్తమామలు  ఇచ్చిన కట్నం సరిపోలేదని ఇటీవల కాలంలో ఎంతోమంది పెళ్ళికొడుకులు ఏకంగా పెళ్లి వేదికపైనే వివాహాన్ని క్యాన్సల్ చేసుకోవడం లాంటి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు కనిపించేవి. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఇలా కట్నం గురించి వరుడు మొండికేసినప్పుడు కుటుంబ సభ్యులు కలగజేసుకొని ఏదో ఒకటి నచ్చజెప్పి పెళ్లి తంతును పూర్తి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఇలా కట్నం సరిపోలేదు అని పెళ్లి క్యాన్సిల్ అవడం అంటే అందరూ వరుడే అలా చేసి ఉంటాడు అని అందరూ ఫిక్స్ అవుతూ ఉంటారు.


 కానీ ఇక్కడ మాత్రం ఊహ కందని ఘటన జరిగింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు పెళ్ళికొడుకు మాత్రమే కట్నం గురించి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం  చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పెళ్లికూతురు కట్నం సరిపోలేదని వరుడికి షాక్ ఇచ్చింది. తనకు పెళ్లి వద్దే వద్దంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన కాస్తా అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది అని చెప్పాలి. మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్  పరిధిలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యువతతో పెద్దలు వివాహం నిశ్చయించారు.



 ఈ క్రమంలోనే రెండు లక్షల కట్నం ఇచ్చే విధంగా కుల పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కూడా కుదిరింది. రాత్రి 7:30 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అబ్బాయి కుటుంబ సభ్యులు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. కానీ ఎంతకీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం రాలేదు. ఏంటా అని ఆరా తీస్తే  షాకింగ్ విషయం తెలిసింది. అబ్బాయి ఇచ్చే కట్నం సరిపోవడం లేదని.. ఇక వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అయితే ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ముందుగా ఇచ్చిన రెండు లక్షల వదిలేసారు వరుడు కుటుంబ సభ్యులు. చివరికి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు .

మరింత సమాచారం తెలుసుకోండి: