నేటి రోజుల్లో వెలుగులోకి  వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషులకు తాము మనుషులం అనే విషయం గుర్తుందా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సమయానుగుణంగా విచక్షణతో ప్రవర్తించాల్సిన మనిషి విచక్షణ కోల్పోయి చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నాడు. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆదిమానవుల కాలంలో కూడా ఇలాంటి దారుణాలు జరగలేదేమో అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 ముఖ్యంగా ఇటీవల కాలంలో మద్యం డ్రగ్స్ అనే మత్తులో మునిగితేలుతున్న మనిషి ఏం చేస్తున్నాడో కూడా తెలియని విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోలోకి వస్తుంది. మద్యం ఎంత అనర్ధమో అందరికీ తెలుసు. మద్యం తాగడం ద్వారా ఆరోగ్యం పాడవుతుంది అన్న విషయంపై కూడా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఇటీవల కాలంలో మద్యం తాగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొంతమంది అయితే మద్యం మత్తులో చేయకూడని పనులు చేసేస్తున్నారు.


 అయితే ఇక్కడ ఒక వ్యక్తి కడుపునొప్పిగా ఉంది అంటూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. అయితే డాక్టర్లు పరీక్షించి చూసి ఏకంగా పేషెంట్ కడుపులో ఒక మద్యం సీసా ఉండడం చూసి బిత్తర పోయారు.  రెండున్నర గంటల పాటు కష్టపడి దానిని బయటకు తీశారు. ఘటన నేపాల్ రాజధాని ఖాట్మండు లో వెలుగు చూసింది. రౌతా హాట్ కు చెందిన 26 ఏళ్ల నర్షాద్ మన్సూరి కడుపునొప్పితో విలవిలలాడుతూ ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అయితే కడుపులో స్కానింగ్ తీసిన వైద్యులు ఒకసారిగా షాక్ అయ్యారూ. ఏకంగా మద్యం సీసా పొట్టలో కనిపించింది. ఇక అతి కష్టం మీద శస్త్ర చికిత్స చేసి సీసాను బయటికి తీశారు వైద్యులు. అయితే మన్సూరి  స్నేహితులే అతడు చేత మద్యం తాగించి మత్తులో ఉన్నప్పుడు మలద్వారం ద్వారా సీసాను లోపలికి జొప్పించి  ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: