
సినిమాల్లో మాదిరిగానే వెంటాడి వేటాడి మరి దారుణంగా హత్య చేస్తున్న తీరు చూసి సభ్య సమాజంలో బ్రతుకుతుంది నిజంగా మనిషి లేనా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఇలాంటి తరహా దారుణమైన హత్యయత్నం ఒకటి జరిగింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. నాసిక్ లోని కార్బన్ నాకా ప్రాంతంలో ఏకంగా సినిమా స్టైల్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది అని చెప్పాలి.
కారులో వెళ్తున్న ఒక యువకుడిపై ముగ్గురు యువకులు కత్తులతో దాడికి దిగారు. తపన్ జాదవ్ తన కారులో వెళ్తున్నాడు. అదే సమయంలో నిందితులు కార్బన్ నాకా ప్రాంతంలో కారును వెనుక నుంచి ఢీకొట్టారు. ఢీ కొట్టిన వెంటనే కారు దిశను మార్చుకుంది. ఇక నిందితుడు ఆసీస్ జాదవ్ ఇద్దరు సహచరలతో కలిసి తపన్ ను హతమార్చేందుకు కారు దిగాడు. దీంతో భయపడిపోయిన తపన్ వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితులు కారు దిగి అతని వెంబడించడం మొదలుపెట్టారు. తపన్ పై కాల్పులు కూడా జరిపి కత్తితో పొడిచి దారుణంగా చంపేందుకు ప్రయత్నించగా ప్రస్తుతం తపన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.