ఇటీవల కాలంలో మందుబాబుల కోసం ఎన్నో చిత్ర విచిత్రమైన బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చిన బ్రాండ్ కొనుగోలు చేసి ఇక మద్యం  మత్తులో ఊగడానికే ఎంతో మంది మందుబాబులు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఇక మద్యం తాగడం విషయంలో కూడా ఇటీవల కాలంలో ఎంతోమంది కొన్ని చాలెంజ్ లు పెట్టుకొని మరీ ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉన్నారు. ఇలా పందెం కాసి ఎంతో మంది ఎక్కువ మద్యం తాగి.. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.



 అయితే ఇలా మద్యంలో ఉన్న ఎన్నో రకాల బ్రాండ్లలో అటు టకీల షాట్స్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా పబ్ లలో ఎక్కువగా ఇలాంటి టక్కీలా షాట్స్ ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. టీ గ్లాస్ కంటే చిన్నగా ఉండే క్లాసులో ఇలా మద్యం పోసుకొని తాగడం ద్వారా అదిరిపోయే కిక్కు వస్తుందని అందరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఏకంగా ఇలా వరుసగా టకీల షాట్స్ తాగడం ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైంది. పోలాండ్ లోని స్ట్రిప్ క్లబ్లో 36 ఏళ్ల బ్రిటిష్ టూరిస్ట్ 90 నిమిషాల్లో 22 షాట్స్ తాగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.



 ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అతను క్లబ్ కు వచ్చే ముందే మద్యం సేవించి ఉన్నాడని.. క్లబ్ లోకి ఫ్రీ ఎంట్రీ ఉండడంతో లోపలికి వచ్చాడని క్లబ్ నిర్వాహకులు చెబుతూ ఉండడం గమనార్హం. కాగా చనిపోయిన వ్యక్తి శరీరంలో 0.4% ఆల్కహాల్ ఉందని.. అది ప్రాణాంతకం అంటూ పోలాండ్ నేషనల్ ప్రాసిక్యూటర్ ఆఫీసర్ పేర్కొన్నారు అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనంగా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం మద్యం తాగడం వల్లే అతను మరణించాడ లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: