ఒకవైపు ప్రభుత్వం సర్కారు దావకానాల్లో అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలందరూ కూడా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తుంది. అయితే అంత బాగానే ఉన్నా అటు ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు అని చెప్పాలి.  ఇక పేషెంట్లకు చికిత్స చేయడం విషయంలో నిర్లక్ష్య వైఖరిని వీరడం లేదు ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది. ఈ క్రమంలోనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లాలంటేనే ప్రతి ఒక్కరు కూడా వనికి పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి ఒక దారుణకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యుడి పర్యవేక్షణలో కాకుండా ఇక నర్సులే డాక్టర్లుగా మారి చికిత్స అందించి.. చివరికి ఒక శిశువు మరణానికి కారణం అయ్యారు. అంతేకాదు ఏకంగా గర్భవతి అయిన మహిళపై కూడా దారుణంగా దాడికి పాల్పడ్డారు అని చెప్పాలి. ఈ ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికులందరూ కూడా షాక్ అవుతున్నారు.



 సాధారణంగా ఒక గర్భిణీ మహిళకు డెలివరీ చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ సమక్షంలోనే చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వైద్యులు లేకుండానే నిండు గర్భిణీ మంజులకు నర్సులు నార్మల్ డెలివరీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కడుపుపై ఒత్తిడి చేశారు. చివరికి నార్మల్ డెలివరీ కాదు అని భావించి ఇక వైద్యులు లేకుండానే సొంతంగా సర్జరీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో చివరికి శిశువు మృతి చెందింది. ఇక ఆసుపత్రి సిబ్బంది గర్భిణీని కొట్టడంతో శిశువు మరణించిందని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: