ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇంటర్ ఫలితాల గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఇటీవల కాలంలో వరుసగా విడుదలవుతున్న ఇంటర్ ఫలితాలలో ఎక్కువ మార్కులు సాధించి ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది చదువుపై ఆసక్తితో 100కి 100 మార్కులు సాధించడం కూడా చూస్తూ ఉన్నాం.ఇలా విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలు సాధించిన మార్కుల గురించి చర్చించుకుంటూ ఉంటే.. ఈ మార్కులపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా ప్రత్యక్షమవుతున్నాయి.


 దీంతో ఇక అటు సోషల్ మీడియాలో కూడా ఇంటర్ ఫలితాల గురించి చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు కొంతమంది ఫెయిల్ అయ్యాము అనే బాధతో సూసైడ్ చేసుకోవడంతో ఇక ఇలాంటి వార్తలు కూడా తెరమీదికి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం కనీ విని ఎరుగనిది. ఇలాంటి విచిత్రమైన ఘటన కూడా జరుగుతుందా అని ప్రతి ఒక్కరికి విషయం తెలిసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు వందకి వంద మార్కులు సాధించిన విద్యార్థులను చూసాం. కానీ ఇక్కడ ఒక విద్యార్థి మాత్రం అంతకంటే గ్రేట్.


 ఎందుకు అంటారా.. ఇక్కడ ఒక విద్యార్థి 100కు 100 మార్కులు సాధించడం కాదు.. 138 మార్కులను సంపాదించింది. ఇలా తమిళనాడు ఇంటర్ ఫలితాలు విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో మధురై కి చెందిన ఓ విద్యార్థికి వందకి 138 మార్కులు వచ్చాయి. మొత్తం 600 మార్కులకు గాను 514 మార్కులు వచ్చిన.. ఇక నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ ఘటన సంచలనంగా మారగా విద్యార్థి పేరెంట్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. మరోవైపు దిండికల్ కు చెందిన నందిని కి 600కు 600 మార్కులు వచ్చాయి అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: