ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచనలు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అనే విషయంపై ఇటీవల ఒక సర్వే నిర్వహించగా షాకింగ్ విషయం బయటపడింది. ఇలాంటి ఆలోచనలు ప్రత్యేకమైన సందర్భాల్లో ఎక్కువగా వస్తాయని ఇక ఈ సర్వే నివేదిక చెబుతుంది. రోజు ఉదయం వేళతో పాటు అత్యధికంగా డిసెంబర్ నెలలో ఇలాంటి తరహా ఆలోచనలు వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలలో ప్రజలతో జరిపిన అధ్యయనంలో విషయం బయటికి వచ్చింది. సంవత్సరంలో ఏ నెలలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు ఎక్కువ వస్తాయి అనే విషయాలను గుర్తించేందుకు నెదర్లాండ్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఆన్ స్టార్ డామ్, అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీ, బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హామ్ స్కూల్ ఆఫ్ సైకాలజీలు సంయుక్త పరిశోధనలు చేపట్టాయి.
ఈ క్రమంలోని ఏ సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది అనే విషయంపై ప్రశ్నావళిని రూపొందించి ఆరేళ్లపాటు 10000 మంది స్పందనలు సేకరించారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా ఆత్మహత్యలు ఉంటాయని ప్రజలు భావించినప్పటికీ.. వసంతకాలం లేదా వేసవికాలంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు మధ్యలోనే ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇక డిసెంబర్ నెలలో ఆత్మహత్యలకు సంబంధించిన ఆలోచన ఎక్కువగా వస్తుందట. జూన్ లాంటి నెలల్లో ఇలాంటి ఆలోచనలు తక్కువగా ఉంటాయి అని చెప్పాలి.