ఒకరు చేసిన పాపం ఇంకొకరికి శాపంలా మారుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మహిళ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా సరే కోటి ఆశలతో పెళ్లి అనే బంధం లోకి అడుగుపెడుతుంది. కట్టుకున్న భర్తతో కలకాలం సంతోషంగా సుఖంగా బ్రతకాలని భావిస్తుంది.


 ఈ క్రమంలోనే పుట్టినింటి నుంచి మెట్టినింటికి  వెళ్లడం కాస్త బాధగా ఉన్నప్పటికీ.. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో భర్తతో పాటు ఏడు అడుగులు వేస్తుంది ఆడపిల్ల. కానీ ఇలా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే సుఖంగా చూసుకుంటాడు అనుకున్న భర్త దూరమైతే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టం. ఇక్కడ ఒక మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. పెళ్లయిన కొన్నాళ్ళకి ఒక హత్య కేసులో భర్త జైలుకు వెళ్లాడు. అయితే కోర్టు విచారణలో అతనే నిందితుడు అని తేలడంతో చివరికి న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


 అయితే కోటి ఆశలతో దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన ఆ మహిళ జీవితం మాత్రం పెళ్లయిన కొన్నాళ్లకే ఒంటరిగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల జైలు అధికారులను ఆ మహిళ వింతైన కోరిక కోరింది. తనకు సంతానం కావాలని.. అందుకోసం జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పేరోల్ పై విడుదల చేయాలని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జైలు అధికారులను మహిళ కోరింది. జాతవ్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం పెళ్లి అవ్వగా.. పెళ్లయిన కొద్ది రోజులకి హత్య కేసులో అరెస్టు అయ్యాడు. అయితే దోషగా తేలడంతో.. కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో పెరోల్ కోసం భార్య ఇలా విజ్ఞప్తి చేసింది. అయితే గతంలో రాజస్థాన్ లో పేరోల్ ఇలాంటి కేసులో కోర్టు ఫేర్వెల్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: