సాధరణంగా పొట్లకాయ కూర తినడానికి చాలా మంది ఇష్ట పడరు. అందుకే పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసి చూడండి.చాలా బాగుంటుంది. పొట్లకాయను పత్యపు వంటగా కూడా వండుతారు. పొట్లకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వలన ఇది తేలికగా జీర్ణమవుతుంది.ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది  మరి ఆలస్యం చేయకుండా పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా
కావలసిన పదార్ధాలు :

1.పొట్లకాయ 1
2.గట్టి పెరుగు -250ml
3.అల్లం చిన్న ముక్క
4.పచ్చి మిర్చి 3
5.ఉప్పు తగినంత(రుచికి సరిపడా)
6.ఎండు మిర్చి 1
7.మినప పప్పు ½ టీ స్పూన్
8.ఆవాలు ¼ టీ స్పూన్
9.జీలకర్ర ¼ టీ స్పూన్
10.మెంతులు ¼ టీ స్పూన్
11.ఇంగువ చిటికెడు
12.కరివేపాకు లేదా కొతిమీర కొద్దిగా
13.నూనె 1 టీస్పూన్

తయారు చేయు విధానం:

ముందుగా పొట్లకాయను శుబ్రముగా కడిగి పైన తోలును చంచాతో గిరేయ్యండి. ఆ తర్వాత  గుండ్రని ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి వేసి వేపాలి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసి వేపండి. అవి వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకొండి. మళ్ళీ అదే నూనెలో గుండ్రంగా కోసుకుని పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసి బాగా వేపాలి. ఉప్పు వేస్తే పొట్లకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. పొట్లకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్ది సేపు చల్లారిన తరువాత మిక్సీ జార్ లో వేయండి. అలాగే ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేయాలి.అందులోనే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు,ఉప్పు వేసి ఒక మాదిరిగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో పెరుగును యాడ్ ను చేసి గరిటతో తిప్పండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, సాయిమినపప్పు వేసి పోపు పెట్టాలి.ఇప్పుడు ఇలా వేగిన పోపును కొంచెం చల్లార్చి పొట్లకాయ, పెరుగు కలిపిన పచ్చడిలో పోయాలి. అలాగే  కొంచెం కొతిమీర తురుము కూడా వేస్తే బాగుంటుంది. అన్నంలోకి గాని, చపాతీలోకి గాని ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: