స్వీట్ కార్న్ అంటే ఇష్టం లేని వారు చాల తక్కువగా ఉంటారు.అలాంటి స్వీట్ కార్న్ తో ఎప్పుడూ ఉడకబెట్టి ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా బిర్యానీ కూడా చేసి చూడండి.

కావలసిన పదార్దాలు:

 స్వీట్ కార్న్ :1 కప్పు

నెయ్యీ:1 టేబుల్ స్పూన్

నూనె: 2 టేబుల్ స్పూన్

బిర్యాని ఆకు:2

యాలుకలు:2

లవంగాలు:4

దాల్చినచెక్క:1 మీడియం

షాజీరా:1/2 టేబుల్ స్పూన్

బిర్యాని రైస్:1 కప్పు

నీరు:1.5 కప్పు

జీడిపప్పు:5 పలుకులు

ఉల్లిపాయలు:1 పెద్దది

పచ్చిమిరపకాయలు:4

అల్లం వెల్లుల్లి పేస్టు:1 టీ స్పూన్

ఉప్పు:తగినంత

కొత్తిమీర:1/2 కప్పు

తయారి విదానం:

ముందుగా ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ వెలిగించి నెయ్యీ,నూనె వేసి వేడి అయిన తర్వాత బిర్యాని ఆకు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా వేసి  వేయిoచాలి.తరువాత ఉల్లిపాయలు చిలికలుగా కోసుకొని వేయాలిఅవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిoచాలి.తర్వాత పచ్చి మిరపకాయలు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసిపచ్చి వాసన పోయే వరకు వేయిoచాలి.తర్వాత ఇందులో స్వీట్ కార్న్ వేసి ఆ మసాలా కొంచెం పట్టే వరకు వేయిoచాలి. తర్వాత ముందుగా అర గంట క్రితం కడిగి నాన బెట్టుకున్న బిర్యాని రైస్ను వేసి కొంచం సేపు వేపుకోవాలి. తర్వాత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి.ఇందులో నీరు వేసి నీరు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత పన్నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తరువాత మూత తీసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే.అదే మనం మాములు రైస్ తో చేసుకోవాలి అంటే బియాన్ని గంట క్రితం నానబెట్టుకోవాలి.నీటిని ఒక కప్పు బియ్యానికి రొండు కప్పుల నీటిని తీసుకోవాలి.అలాగే పాన్లో చేసుకోవటానికి బిర్యాని రైస్ను కి 2 కప్పుల నీరు కావాలి. స్వీట్ కార్న్ తో ఎప్పుడూ ఉడకబెట్టి ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా బిర్యానీ కూడా చేసి చూడండి.చాల రుచిగా మళ్ళి మళ్ళి తినాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: